భారత బౌలర్ల దాటికి బంగ్లా విలవిలా..!

భారత బౌలర్ల దాటికి బంగ్లా విలవిలా..!

టీ-20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌పై గురిపెట్టింది.. ఇండోర్‌లో భారత్-బంగ్లా మధ్య తొలి టెస్ట్ జరుగుతుండగా.. భారత బౌలర్ల దాటికి మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 58.3 ఓవర్లలోనే కేవలం 150 పరుగులకే పెవిలియన్ చేరింది.. ముష్ఫికుర్ రహీం 43, కెప్టెన్ మొమినుల్ హక్ 37.. మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓవైపు భారత బౌలర్లలు పదునైన బంతులతో విరుచుకుపడుతుంటే.. వికెట్ల ముందు నిలబడలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు బంగ్లా బ్యాట్స్‌మన్లు.. మరోవైపు టీమిండియా బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.