రెండు పడవలు ఢీ..23 మంది మృతి..!

 రెండు పడవలు ఢీ..23 మంది మృతి..!

రోడ్డు ప్రమాదాలే కాకుండా ఈ మధ్య జల ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవల గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా  బంగ్లాదేశ్ లోని బురిగంగా నదిలో కూడా అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. మున్షిగంజ్ నుంచి సదర్ ఘాట్ వెళ్తున్న ‘ఎంవీ మార్నింగ్ బర్డ్’, ఎదురుగా వస్తున్న‘మౌయురి-2’ పడవలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మార్నింగ్ బర్డ్ అనే పడవ నీటిలో మునిగిపోయింది.  దాంతో పడవలో ఉన్న 50 మంది నీటిలో పడిపోగా వారిలో 23మంది జలసమాధి అయ్యారు. కొంతమందికి ఈత రావటంతో ఒడ్డుకు చేరుకున్నారు. మరి కొంత మందిని రెస్క్యూ టీం సిబ్బంది కాపాడారు. వీరిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.