అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ : బంగ్లాదేశ్ టార్గెట్ 178

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ : బంగ్లాదేశ్ టార్గెట్ 178

 అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత క్రికెటర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ కి దిగిన టీమిండియాను బంగ్లా బౌలర్లు బెంబేలేత్తించడంతో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలబడలేకపోయారు. ప్రతి ఒక్కరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 88, తిలక్ వర్మ 38, ధ్రువ్ జురేల్ 22 మినహా ఎవ్వరూ రాణించలేదు. మిగతా బ్యాట్మెన్స్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు. ఇక బంగ్లా బౌలర్లలో అవిషేక్ దాస్ 3, ఇస్లామ్, తంజిమ్ హాసన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక యశస్వి జైశ్వాల్‌ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. క్లిష్టపరిస్థితుల్లో అద్వితీయ ఆటతో మరోసారి ఆకట్టుకున్నాడు. ధ్రేవ్‌ జురేల్‌(22) చివరి నిముషంలో అనూహ్యంగా రనౌట్‌ కావడంతో భారత్‌ మంచి స్కోరు చేసే వకాశాన్ని కోల్పోయింది.