వ్యాక్సిన్‌ అందింది.. మోడీకి ధన్యవాదాలు..

వ్యాక్సిన్‌ అందింది.. మోడీకి ధన్యవాదాలు..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు దేశంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించడమే కాదు.. ఇతర దేశాలకు సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిస్తోంది భారత్‌.. అందులో భాగంగా.. భారత్‌లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్.. రెండు మిలియన్ డోసులను బంగ్లాదేశ్‌కు చేరుకున్నాయి.. మరో మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులను కూడా భారత్‌ నుంచి బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తుంది. ఓవైపు బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతో ఆందోళన కలిగిస్తోన్న సమయంలో.. వ్యాక్సిన్లను కానుకగా ఇచ్చింది భారత్‌. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా... భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఢాకా విశ్వవిద్యాలయం 100వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగిన ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.30 లక్షలకు పైగానే నమోదయ్యాయి.. మృతుల సంఖ్య ఇప్పటి వరకు 8 వేలకు చేరువైంది.