బంగ్లాదేశ్ లో భారతీయ యువతి అరెస్ట్..!

బంగ్లాదేశ్ లో భారతీయ యువతి అరెస్ట్..!

బంగ్లాదేశ్ లో భారత్ కు చెందిన యువతి అరెస్ట్ అయ్యింది. పాతికేళ్ల ఆయేషా జన్నత్ మొహానా అనే యువతిని అక్కడి కౌంటర్ టెర్రరిజం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమాత్ ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే ఉగ్రవాద సంస్థలో ఆమె పని చేస్తునట్టు పోలీసులు గుర్తించారు. వెస్ట్ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాకు చెందిన జన్నత్ అసలు పేరు ప్రగ్యా దేవ్ నాథ్ కాగా ఆమె ఆన్ ఆన్లైన్ లో మతపరమైన పాఠాలను వింటూ క్రమంగా ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితురాలైంది. అనంతరం ఆమెకు 2016 లో జమాత్ ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ మహిళా విభాగం చీఫ్ ఆస్మా ఖాతూన్ అనే మహిళ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి జన్నత్ ఆమెతో కలిసి పని చేస్తుంది. ఇటీవల అస్మా ఖాతూన్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జన్నత్ యువతులు, బాలికలను రిక్రూట్ చేసుకునే బాధ్యతను తీసుకుని కార్యకలాపాలను కొనసాగిస్తోంది. నకిలీ పాస్పోర్ట్ లతో జన్నత్ అనేక సార్లు బాంగ్లాదేశ్ నుండి బెంగాల్ కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి విచారిస్తున్నారు.