శ్రీలంకకు మరో దెబ్బ... 

శ్రీలంకకు మరో దెబ్బ... 

కరోనా కారణంగా నష్టపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అన్ని అనుకున్నట్లు జరిగితే  వచ్చే రెండు నెలల్లో భారత్, బంగ్లాదేశ్‌కు ఆతిథ్యమివ్వాలని చూసింది. అందుకోసం ఆ రెండు దేశాల బోర్డులకు లేఖలు కూడా రాసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకారణంగా శ్రీలంక పర్యటనను నిలిపివేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. టీమ్ ఇండియా మొదట 2020 జూన్ 24 నుండి 3 వన్డేలు మరియు టీ 20 ల కోసం శ్రీలంకకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా తమ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వచ్చే నెలలో జరగబోయే  శ్రీలంక పర్యటనకు మా ఆటగాళ్ళు పెద్దగా ఆసక్తి చూపడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మన్ అక్రమ్ ఖాన్ అన్నారు. అయితే ఇప్పటికే ముగ్గురు బంగ్లా ఆటగాళ్లకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. భారత్, బంగ్లా పర్యటనలు రెండు వాయిదా పడటం శ్రీలంకకు ఆర్ధికంగా గట్టిదెబ్బ అనే చెప్పాలి.