హైద‌రాబాద్‌లోని స్టార్ హోట‌ల్‌లో పార్టీ.. 8 మంది అరెస్ట్..!

హైద‌రాబాద్‌లోని స్టార్ హోట‌ల్‌లో పార్టీ.. 8 మంది అరెస్ట్..!

క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న స‌మ‌యంలో.. ఫంక్ష‌న్ల‌పై కూడా ఆంక్ష‌లు విధించింది ప్ర‌భుత్వం.. లాక్‌డౌన్ ముగిసి.. అన్‌లాక్ కొన‌సాగుతుండ‌గా.. పెళ్లిళ్ల‌కు 50 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇస్తోంది ప్ర‌భుత్వం.. ఇదే స‌మ‌యంలో.. ఇత‌ర పార్టీలు, ఫంక్ష‌న్లు, ఎక్కువ‌మంది గుమ్మిగూడే అవ‌కాశం ఉన్న దావ‌త్‌ల‌కు అనుమ‌తి లేదు.. ఏదైనా చేసుకున్నా.. ఆ ఫ్యామిలీ వ‌ర‌కే ప‌రిమితం కావాలి.. అయితే.. హైద‌రాబాద్‌లోని ఓ స్టార్ హోట‌ల్‌లో ఓ పార్టీ జ‌రిగింది.. పార్క్ హయత్ హోట‌ల్‌లో కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి పార్టీ చేసుకున్నారు యువ‌కులు.. స‌మాచారం అంద‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.. ఎనిమిది మందిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. పార్టీ తీరుపై కూడా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.