12 ప్రభుత్వ బ్యాంకులకు రూ.48,239 కోట్ల రీకాపిటలైజేషన్

12 ప్రభుత్వ బ్యాంకులకు రూ.48,239 కోట్ల రీకాపిటలైజేషన్

మోసంతో చతికిలబడ్డ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,239 కోట్ల మేర రీకాపిటలైజేషన్ కు ప్రభుత్వం ఇవాళ ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ బ్యాంకుకు అత్యధిక మొత్తం కేటాయించగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అతి తక్కువ మొత్తం దక్కనుంది. అలహాబాద్ బ్యాంకులో రూ.6,896 కోట్లు, యూనియన్ బ్యాంక్ లో రూ.4,112 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.4,638 కోట్లు, బ్యాంక్ మహారాష్ట్రలో రూ.205 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకులో రూ.9,086 కోట్లు భర్తీ చేయనుంది. అలాగే ఆంధ్రా బ్యాంకులో రూ.3,256 కోట్లు, సిండికేట్ బ్యాంకులో రూ.1,603 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.5,908 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,560 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అదే విధంగా యునైటెడ్ బ్యాంక్ లో రూ.2,839 కోట్లు, యుకో బ్యాంక్ లో రూ.3,330 కోట్లు చొప్పించనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రభుత్వం రూ.3,806 కోట్లు పెట్టనుంది.