బ్యాంకు షేర్లు ఢమాల్‌

బ్యాంకు షేర్లు ఢమాల్‌

కనీసం అరశాతం వరకు వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఆర్బీఐ తీవ్ర నిరాశపర్చింది. పావు శాతం తగ్గిస్తుందన్న అంశాన్ని మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసింది. ఎన్‌బీఎఫ్‌సీలకు స్పందించిన ముఖ్యంగా వాటికి లిక్విడిటీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని మార్కెట్‌ ఆశించింది. ఈ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్బీఐ పేర్కొంది. పరపతి విధానంలో ఏదైనా మెరుపులు ఉంటాయని, వడ్డీ రేట్లు అరశాతం తగ్గిస్తారని భావించిన ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్లను భారీగా అమ్మడం ప్రారంభించారు. బ్యాంక్‌ నిఫ్టి సూచీ కూడా మిడ్‌ సెషన్‌ కల్లా 400 పాయింట్లకు పైగా క్షీణించింది. దాదాపు అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ బ్యాంకుల షేర్లు మూడు శాతంపైగా క్షీణించాయి. కొన్ని షేర్లు అయిదు శాతం వరకు తగ్గాయి. అలాగే వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన ఆటో రంగ కంపెనీల ఇన్వెస్టర్లు కూడా నిరాశ చెందారు. దీంతో ఆ రంగానికి చెందిన షేర్లు కూడా  క్షీణించాయి. మిడ్‌సెషన్‌ సమాయానికి నిఫ్టి 112 పాయింట్ల నష్టంతో 11910 వద్ద ట్రేడవుతోంది.