రెండో రోజూ సమ్మె... ఏటీఎంలు ఖాళీ!

రెండో రోజూ సమ్మె... ఏటీఎంలు ఖాళీ!

పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది... దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులంతా ఈ రోజు కూడా విధులు బహిష్కరిస్తున్నారు. దీంతో బ్యాంకు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి... వేతనాల సవరణ, దీర్ఘకాలికంగా పెండిగ్‌లో ఉన్న సమస్యలను డిమాండ్ చేస్తున్నాయి బ్యాంకు ఉద్యోగ సంఘాలు. ఉద్యోగుల జీతాలను 2 శాతం పెంచుతూ ఇటీవల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన బ్యాంక్ యూనియన్స్... దానిని 15 శాతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిన్నటి నుంచి సమ్మె కొనసాగుతుండడంతో ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ రోజు సమ్మె విరమించినా దీని ప్రభావం రేపు కూడా ఉంటుందంటున్నారు.