వరుసగా 5 రోజులు బ్యాంక్‌లు బంద్...! ఎప్పటి నుంచి అంటే..?

వరుసగా 5 రోజులు బ్యాంక్‌లు బంద్...! ఎప్పటి నుంచి అంటే..?

వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంక్‌లు మూతపడనున్నాయి... మొన్నటికి మొన్న మూడు రోజులు బ్యాంకులు తెరుచుకోలేదు... జనవరి 31న, ఫిబ్రవరి 1న, ఆ వెంటనే ఆదివారం ఫిబ్రవరి 2న కూడా బ్యాంకులు మూతపడ్డాయి. ఇక, రెండు రోజుల బ్యాంకు సమ్మె తర్వాత పీఎస్‌యూ బ్యాంకుల ఉద్యోగులు మరో సమ్మెకు సిద్ధమవుతున్నారు. మార్చి రెండో వారంలో అనేక బ్యాంకులు, ఏటీఎంలు వరుసగా ఐదు రోజులు మూసివేయొచ్చు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకారం, భారత బ్యాంకుల సంఘంతో వేతన సవరణ చర్చల తర్వాత మార్చి 11 నుండి 13 వరకు 3 రోజుల సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. ఇక, 14న రెండో శనివారం, ఆ వెంటనే ఆదివారం రావడంతో... వరుసగా ఐదు రోజులు బ్యాంకు కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. 

ఇక, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి... భారత్ బంద్ సందర్భంగా జనవరి 8న బ్యాంకింగ్ సేవలను కూడా ప్రభావితం అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఇది మూడవ బ్యాంక్ సమ్మె కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి యూనియన్లు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరవధిక అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చాయి.