బ్యాంకుల సమ్మె... జీతాలకు కష్టాలు...!

బ్యాంకుల సమ్మె... జీతాలకు కష్టాలు...!

ఓవైపు జనవరి 31న, ఆ వెంటనే ఫిబ్రవరి 1వ తేదీ... ఆ తర్వాత ఆదివారం ఇలా మూడు రోజులు బ్యాంకులు మూతపడనుండడంతో వేతనజీవులు సోమవారం వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. బ్యాంక్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండు రోజులపాటు సమ్మె చేయనున్నారు.  దీంతో బ్యాంకింగ్‌ కార్యకలాపాలైన చెక్కు క్లియరెన్స్‌, నగదు ఉపసంహరణ, డిపాజిట్‌ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కానీ, ప్రైవేట్‌ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రమ యథాతథంగా పనిచేయనున్నాయి. ఉద్యోగ సంఘాలు వేతనాలను 20 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్నాయి.. కానీ, ఐపీఏ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. రెండు రోజుల సమ్మెకు తోడు.. మూడో రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.