వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్‌..!

వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్‌..!

బ్యాంకు లావాదేవీల్లో బిజీగా ఉంటూ.. నిత్యం బ్యాంకులకు చుట్టూ తిరిగేవారు కాస్త ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది.. లేకపోతే ఐదు రోజుల పాటు తమ లావాదేవీలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే.. వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్‌ చేయనున్నారు. బ్యాంకు యూనియన్లు ముందుగా ప్రకటించినట్టుగా.. ఈ నెల 26వ తేదీ నుంచి రెండు రోజులపాటు బ్యాంకులు బంద్‌ కానుండగా.. ఆ తర్వాత 28వ తేదీ నాల్గో శనివారం, 29వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులు సాధారణంగా పనిచేయవు.. ఇక ఈ నెల 30వ తేదీన బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు ఉండడంతో.. ఆ రోజూ కూడా లావాదేవీలకు అవకాశం లేదు.. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మరోవైపు అక్టోబర్ 1వ తేదీన పనిచేసినా.. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా మళ్లీ బ్యాంకులకు సెలవు ఉంది. నెల చివరల్లో వరుసగా ఐదు రోజులు సెలవు రావడంతో ఈ సారి వేతన జీవులకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.