వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో నిషేధిత ఆటగాడు..!

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో నిషేధిత ఆటగాడు..!

వరల్డ్‌కప్‌లో ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌ను శ్రీలంక మాజీ స్టార్‌ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య స్టేడియంలో నేరుగా వీక్షించడం వివాదాస్పంగా మారింది. క్రికెటర్‌గా కెరీర్‌ ముగిసిన తర్వాత సెలెక్టర్‌గా కొనసాగిన సనత్‌ జయసూర్యపై ప్రస్తుతం ఐసీసీ బ్యాన్‌ కొనసాగుతోంది. అవినీతికి పాల్పడినందుకుగానూ అతనిపై రెండేళ్లపాటు ఐసీసీ నిషేధం విధించింది. అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘించాడనే కారణంగా ఐసీసీ అతడిపై వేటు వేసింది. ఈ బ్యాన్‌లో భాగంగా జయసూర్య.. రెండేళ్లపాటు క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

ఐతే.. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ను శ్రీలంక మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వాతో కలిసి వీక్షకుల గ్యాలరీలో కూర్చుని వీక్షించాడు జయసూర్య. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో ఐసీసీ స్పందించింది. స్టేడియంలో ఉన్నప్పటికీ జయసూర్య..  ఆటగాళ్లను కానీ, అధికారులను కానీ కలవలేదని స్పష్టం చేసింది.