వీకెండ్‌లో మరింత థ్రిల్...

వీకెండ్‌లో మరింత థ్రిల్...

మందుబాబులకు శుభవార్త. ఇక నుంచి బార్లలో అర్ధరాత్రి వరకు తాగవచ్చు. తాజాగా బార్ల సమయాన్ని అదనంగా గంటపాటు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాత్రి 12 గంటలకు మూసేసే బార్లను ఒంటిగంట వరకు తెరచి ఉంచనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఇది కేవలం శుక్ర, శనివారాలకు మాత్రమే పరిమితం. మిగతా రోజుల్లో మాత్రం యధావిధిగా బార్లు పాత వేళలకే పని చేస్తాయి. జీహెచ్ఎంసీ తో పాటు జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల పరిధిలోని బార్లకే వర్తిస్తుంది. మాములు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 వరకు బార్లు తెరచి ఉంచే అవకాశం ఉంది. వారాంతం రద్దీ ఎక్కువగా ఉంటుందని, సమయాన్ని మరో గంట పెంచాలని బార్ల యజమానుల సంఘం కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.