నేటి నుంచి రొట్టెల పండుగ షురూ..

నేటి నుంచి రొట్టెల పండుగ షురూ..

ప్రతీక నెల్లూరు స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగ. ఈ రోజు నుంచి మొదలు కానున్న రొట్టెల పండుగకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు గంధమహోత్సవం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి, భక్తులకు పంచుతారు. మరుసటి రోజు తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. 14న ముగింపు సభతో రొట్టెల పండుగ ముగుస్తుంది. ఇక్కడ రొట్టె పడితే ఇక కోరిక తీరినట్లే అనేది భక్తుల నమ్మకం. కులం, మతం, ప్రాంతం, పేద, గొప్ప అనే తేడా లేకుండా దేశ నలుమూలల నుంచి అక్కడికి ప్రజలు వస్తుంటారు. గత పది సంవత్సరాల్లో లక్ష నుంచి 12 లక్షలకు భక్తుల సంఖ్య చేరుకుంది అంటే నమ్మకం ఏస్థాయిలో వుందో అర్థమవుతుంది.