వార్నర్‌.. చీటర్‌.. వరల్డ్‌కప్‌

వార్నర్‌.. చీటర్‌.. వరల్డ్‌కప్‌

స్లెడ్జింగ్‌ చేయడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందుంటే.. ట్రోలింగ్‌ చేయడంలో మాత్రం ఇంగ్లండ్‌ అభిమానులు ముందుంటారు. ఇంగ్లండ్‌లో మ్యాచులంటే గ్రౌండ్లో సందడి చేసే ఆ దేశ పాపులర్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ క్లబ్‌ 'బార్మీ ఆర్మీ'.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి జట్లను తమ కామెంట్స్‌తో చికాకుపెడుతూ మానసికంగా దెబ్బతీస్తుంటుంది. మరో 20 రోజుల్లో 2019 ప్రపంచకప్‌ ప్రారంభమవనున్న నేపథ్యంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను టార్గెట్‌ చేసింది 'బార్మీ ఆర్మీ'. ముఖ్యంగా.. కీలక ఆటగాళ్ల గతాన్ని గుర్తుచేస్తూ ట్విట్టర్‌లో మాటల యుద్ధానికి తెరలేపింది. మార్ఫింగ్‌ ఫొటోలతో ట్రోలింగ్‌ స్టార్ట్‌ చేసింది. 

డేవిడ్‌ వార్నర్‌ వేసుకున్న ఆస్ట్రేలియా జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా 'చీట్స్‌' అని మార్ఫింగ్‌ చేసిన 'బార్మీ ఆర్మీ'..  బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన బెన్‌క్రాఫ్ట్‌ను గుర్తు చేస్తూ... కీలక బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌ చేతుల్లో సాండ్‌ పేపర్‌ పట్టుకున్నట్టు ఫొటోలను క్రియేట్‌ చేసి ఫ్యాన్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. 'ఆసీసీ కొత్త జెర్సీ ఇదే' అంటూ ట్యాగ్‌ చేసింది. దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ లాంగర్‌.. ఇటువంటి వాటిని లైట్‌ తీసుకుంటామని చెప్పాడు. 'బార్మీ ఆర్మీ' విమర్శలకు భయపడేది లేదని అన్నాడు.