బట్లా హౌస్ ట్రైలర్ టాక్

బట్లా హౌస్ ట్రైలర్ టాక్

జాన్ అబ్రాహం హీరోగా చేసిన బట్లా హౌస్ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు.  ట్రైలర్ లో కథ మొత్తం అరటిపండు వలిచినట్టు చెప్పినా కట్ చేసిన విధానం అబ్బురపరిచింది.  ఆద్యంతం ఆకట్టుకుంది.  ఉత్కంఠను రేకెత్తించింది.  బట్లా హౌస్ లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న పోలీస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ పగడ్బందీగా ఆ ఇంటిపై దాడులు చేస్తారు. 

ఈ దాడిలో ఆ ఇంట్లో ఉన్న యువకులంతా మరణిస్తారు.  అయితే, వాళ్ళు ఉగ్రవాదులు కాదని, విద్యార్థులనే కొత్త కోణం బయటకు వస్తుంది.  దీంతో సంజయ్ కుమార్ పై విచారణ మొదలౌతుంది.  ఎన్నో ఎదురు దెబ్బలు తింటాడు.  అన్నింటిని ఎదుర్కొని ఆ ఇంట్లో ఉన్నది ఎవరు అన్నది కనిపెట్టడమే సినిమా కథ.  కథను ఆసక్తిగా మలిచిన తీరు బాగుంది.  ట్రైలర్ అంతా చెప్పేసినా.. సినిమాను ఒకసారి చూడాలి అని ఉత్కంఠను కలిగించారు.  ఆగస్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.