రాష్ట్రానికి ఇలాంటి సీఎం దొరకడం దౌర్భాగ్యం : భట్టి విక్రమార్క

 రాష్ట్రానికి ఇలాంటి సీఎం దొరకడం దౌర్భాగ్యం : భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కరోనా విజృంభణతో జనం మానసిక ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి ఇలాంటి సీఎం దొరకడం దౌర్భాగ్యం అని మండిపడ్డారు. కరోనాతో భయంతో జనం ఉంటే... వారిని గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు సరిపోవడం లేదని... frbm పరిధి 5 కి పెంచుకున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. Frbm పెంచుకుని... 5 నుండి 6 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టబోతున్నారని తెలిపారు. ఇన్ని లక్షల కోట్లతో ప్రజల ఆరోగ్యం చూసుకుంటున్నారా.? అంటే అది కూడా లేదని అన్నారు. వైద్యం..ఆరోగ్యం..విద్య లను మరిచిపోయి కట్టడాలపై పడ్డారన్నారు.  సెక్రటేరియట్ కూల్చుడు..టెండర్లు పిలిచే పనిలోనే ఉన్నారని విమర్శించారు. కేటీఆర్ ...మాట మాట్లాడితే హైదరాబాద్ విశ్వనగరం అంటారు..ఉస్మానియా ఆసుపత్రి చూస్తే తెలుస్తుంది... నీ విశ్వనగరం మొత్తం అని ఎద్దేవా చేసారు. ఈ దుర్మార్గ పాలనను  వదిలించుకోవాలని అన్నారు.