లాలు ప్రసాద్ కోడలిని అవమానిస్తారా...!!

లాలు ప్రసాద్ కోడలిని అవమానిస్తారా...!!

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కోడలిని కొందరు అవమానించారన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడారు. లాలు ప్రసాద్ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ భార్య ఐస్వర్యా రాయ్‌నే అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. ‘ఓ మహిళను అవమానిచడం ఎంత దురాగతమో మీకు తెలుస్తుంద‌’ని నితీష్ అన్నారు. అయితే నితీష్ కుమార్ ఈ ప్రసంగం మొత్తం పోల్ మీటింగ్‌కు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. మన దేశంలో ఓ విద్యవంతురాలైన మహిళకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూడండంటూ ప్రజలను నిలదీశారు. ఇదంతా ఐశ్వర్యా తండ్రి చంద్రికా రాయ్‌ను మెప్పించేందుకే అని కొందరు గుసగుస లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తేజ్ ప్రతాప్, ఐశ్వర్యలు విడిపోయేందుకు పాట్నా కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ అది పెండింగ్‌లోనే ఉంది. అయితే ఐశ్వర్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. అయితే ఇటీవల జరిగిన పోలింగ్ సభకు ఆమె కూడా హాజరయ్యారు. అయితే నితీష్ కుమార్ వేదికను చేరుకునేసరికి అతని పాదాలకు నమస్కరించి, తన ప్రసంగం ఇచ్చింది ఐశ్వర్య. తన ప్రసంగంలో తన తండ్రికి ఓట్లు వేయమని, దాని ద్వారా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించమని ప్రజలను అడిగింది.