వాయిగుండంగా మారిన అల్పపీడనం

వాయిగుండంగా మారిన అల్పపీడనం

వాయువ్య బంగళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిషా ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిషా రాష్ట్రం బాలాసోర్ కు ఆగ్నేయ దిశలో 55 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. వాయుగుండం పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య మాలాసోర్ వద్ద ఈ రాత్రికి తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదిలి తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.