కోహ్లీ తప్పకుండా ఉండాలి... లేకపోతే కష్టం : బంగ్లా

కోహ్లీ తప్పకుండా ఉండాలి... లేకపోతే కష్టం : బంగ్లా

ఈ మధ్య ఓ కొత్త తరహా మ్యాచ్ కి తెర తీసింది ఐసీసీ అదే ఆసియా ఎలెవన్‌ - వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్లు నిర్వహించనుంది. ఈ ఆటకు బంగ్లాదేశ్ వేదిక కానుంది. అయితే ఆసియా జట్టులో ఆసియా దేశాలకు సంబంధించిన ఆటగాళ్లు అలాగే వరల్డ్ జట్టులో మిగితా దేశాలకు సంబంధించిన ఆటగాళ్లు ఆడుతారు. అయితే ఈ మ్యాచ్ లకు బీసీసీఐ భారత్ తరపున నలుగురు ఆటగాళ్లను పంపిస్తుంది. అయితే అందులో కోహ్లీ కూడా ఉన్నాడని సమాచారం వచ్చింది. అయితే తాజాగా ఆసియా జట్టుకు పంపే వారిలో కోహ్లీ లేడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై స్పందించిన బంగ్లా క్రికెట్ బోర్డు బీసీసీఐ తో తప్పకుండా ఈ మ్యాచ్ లకు కోహ్లీ ని పంపించాలని కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కోహ్లీ ఆడితే జట్టు గెలుస్తుందని అందరి నమ్మకం. అయితే ఆసియా తరపున ఆడే ఆటగాళ్లలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ప్రవేశం లేని సంగతి తెలిసిందే. అయితే కేవలం భారత్ , శ్రీ లంక, బంగ్లాదేశ్ , ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే ఆసియా తరపున మ్యాచ్ ఆడుతారు.