బీసీసీఐ సీఈఓ రాజీనామా... 

బీసీసీఐ సీఈఓ రాజీనామా... 

బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ తన పదవికి రాజీనామా చేసారు. ఆయన తన రాజీనామా లేఖను డిసెంబర్ 27 న బీసీసీఐ కి అప్పగించారు. అయితే దానిని ఈ రోజు బీసీసీఐ అంగీకరించింది అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఆ బోర్డు సభ్యులతో  వచ్చిన వివాదాల కారణంగానే ఆయన  రాజీనామా చేసాడు అని తెలుస్తుంది. కానీ ఆయన రాజీనామాను అంగీకరించాలని బీసీసీఐ  అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయించుకుందో తెలియదు. అయితే బీసీసీఐ లో వస్తున్న గొడవల కారణంగా, సుప్రీంకోర్టు లోథా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కోసం బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని ఏర్పాటు చేసింది. అంటే బోర్డు లో వస్తున్న వివాదాల కారణంగా ఏర్పాటు చేసిన ఈ పదవి ఆ వివాదాలలోనే చిక్కుకోవడం గమనార్హం. రాహుల్ జోహ్రీ 2016 ఏప్రిల్‌లో బీసీసీఐ సీఈవో పదవి చేపట్టారు. ఇక బీసీసీఐలో చేరడానికి ముందు ఆయన డిస్కవరీ నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలాగే సౌత్ ఆసియా జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించేచారు.