తొలి టీ-20 జట్టు ఇదే

తొలి టీ-20 జట్టు ఇదే

సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ-20 జరగనుంది. ఈ తొలి టీ-20కి 12 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ తన అధికార ట్విట్టర్ పేజీ ద్వారా జట్టు సభ్యుల వివరాలను పంచుకుంది. ఈ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి చోటు కల్పించలేదు. ధోనీ ఇటీవలే కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం తప్పుకున్న విషయం తెలిసిందే. విండీస్ టూర్ లో రాణించిన కొత్త కుర్రాళ్లు పంత్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్య జట్టులో చోటు దక్కించుకున్నారు.

జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహల్.