ఇంగ్లాండ్ తో టెస్ట్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ...

ఇంగ్లాండ్ తో టెస్ట్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ...

ఐపీఎల్ తర్వాత ఆసీస్ కు వెళ్లిన భారత జట్టు పర్యటన నిన్నటితో ముగిసింది. ఈ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీ20, టెస్ట్ సిరీస్ ను మాత్రం సొంతం చేసుకుంది. అయితే భారత జట్టు తిరిగి వచ్చిన తర్వాత వచ్చే నెల నుండి ఇంగ్లాండ్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ లో తలపడనుంది. అందులో మొదటగా నాలుగు టెస్ట్ ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆసీస్ పర్యటనలో గాయం కారణంగా తప్పుకున్న షమీ, ఉమేష్, జడేజా, విహరిలు ఈ రెండు టెస్ట్ లకు ఎంపిక కాలేదు. అలాగే ఎవరు ఊహించ విధంగా భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ జట్టులో స్థానం దకించుకున్నాడు. అలాగే ఆసీస్ లో చివరి మూడు టెస్ట్ లు ఆడని కెప్టెన్ కోహ్లీ తిరిగి మళ్ళీ జట్టులోకి వచ్చాడు.

భారత జట్టు : విరాట్ కోహ్లీ (c), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, షుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానే (vc), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (wk), వృద్దిమాన్ సాహా (wk), ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, శార్దుల్ ఠాకూర్