వరల్డ్ కప్ కి టీమిండియా జట్టు ప్రకటన

వరల్డ్ కప్ కి టీమిండియా జట్టు ప్రకటన

వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్ లో ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019కి బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది. అంతా ఊహించినట్టుగానే వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానం దక్కించుకున్నాడు. రిజర్వ్ వికెట్ కీపర్ గా అనుభవజ్ఞుడైన దినేష్ కార్తీక్ చోటు సంపాదించాడు. తుది 15 మంది సభ్యుల జట్టులో యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ని ఎంపిక చేయలేదు. ఇప్పటి వరకు నెంబర్ 4గా వరల్డ్ కప్ కి ఎంపిక చేయవచ్చని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడుకి నిరాశే ఎదురైంది. రాయుడికి బదులు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. స్పిన్ ట్విన్స్ కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ తో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్ల కోటాలో కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. పేస్ దళంలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, మొహమ్మద్ షమీలు ఉన్నారు. 

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ