బీసీసీఐ కొత్త సీఈవోగా హేమాంగ్ అమిన్... 

బీసీసీఐ కొత్త సీఈవోగా హేమాంగ్ అమిన్... 

గత వారం రాహుల్ జోహ్రీ రాజీనామాను అంగీకరించిన తరువాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) హేమాంగ్ అమీన్‌ను తాత్కాలిక సీఈఓ గా నియమించింది. ఈ విషయాన్ని బోర్డు ఉద్యోగులకు కూడా తెలియజేసింది. ''బోర్డులో చాల నమకామైన వ్యక్తులలో అమీన్‌ కూడా ఒకరు. ఆయన తన కొత్త పాత్రలో సాధ్యమైనంత సహకారాన్ని మాకు అందించాలని నేను అభ్యర్థిస్తున్నాను ”అని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. జోహ్రీ గత డిసెంబరులో తన రాజీనామాను బీసీసీఐకి పంపారు, కానీ అప్పుడు దానిని బోర్డు అంగీకరించలేదు. కానీ గత గురువారం బీసీసీఐ  జోహ్రీ రాజీనామాను అంగీకరించింది. ఇక జూలై 17 న జరిగే బీసీసీఐ కౌన్సిల్ సమావేశంలో పురుషుల మరియు మహిళల జట్ల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంతో పాటుగా దేశంలో క్రికెట్ పునః ప్రారంభానికి తగ్గిన విధానాలను ఖరారు చేయనుంది.