నవంబర్ 19 నుండి బీసీసీఐ దేశీయ సీజన్లు...

నవంబర్ 19 నుండి బీసీసీఐ దేశీయ సీజన్లు...

కరోనా విరామం తర్వాత సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరపడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత  సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌తో దేశీయ క్రికెట్ సీజన్ ను నవంబర్ 19 నుండి ప్రారంభించడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. కానీ ఐపీఎల్ జట్లలో ఆడుతున్న దేశీయ ఆటగాళ్ళు కరోనా ప్రోటోకాల్స్ కారణంగా మొదటి కొన్ని రౌండ్లు ఆడలేరు. ఇక కరోనా కారణంగా దేశీయ సీజన్ ప్రారంభంలో ఆలస్యం కావడంతో 245 మ్యాచ్లతో కూడిన ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు రంజీ ట్రోఫీని డిసెంబర్ 13- మార్చి 10 వరకు 38 జట్లతో ఆడించాలని బీసీసీఐ చూస్తుంది.

ఇక ఈ సంవత్సరం విజయ్ హజారే ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఛాలెంజర్ సిరీస్ లు ఉండవు. అలాగే ఇరానీ కప్ పై ఇప్పటివరకు బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ షెడ్యూల్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు కార్యదర్శి జే షా ఆమోదం కోసం వెళ్లాయి అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పారు. ఈ సంవత్సరం, గ్రూప్ ఎ, బి మరియు సి నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు అంటే మొత్తం 6 జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఏడవ జట్టుగా మూడు గ్రూపుల నుండి మూడవ స్థానంలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు వెళుతుంది. ఇక గ్రూప్ డి, గ్రూప్ ఇ లలో విజేతలుగా నిలిచిన రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు ఎనిమిదవ జట్టుగా క్వార్టర్ ఫైనల్స్ కు వెళ్తుంది.