'కశ్మీర్‌'పై బీసీసీఐ ఆగ్రహం.. ఐసీసీకి ఫిర్యాదు

'కశ్మీర్‌'పై బీసీసీఐ ఆగ్రహం.. ఐసీసీకి ఫిర్యాదు

వరల్డ్‌కప్‌లో నిన్న ఇండియా-శ్రీలంక మ్యాచ్‌ జరుగుతుండగా 'జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌' అనే బ్యానర్‌ ఉన్న విమానం స్టేడియం మీదుగా వెళ్లడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఇవాళ ఐసీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరిన బీసీసీఐ.. తమ జట్టు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. 

వరల్డ్‌కప్‌లో వారం రోజుల క్రితం పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా 'జస్టిస్‌ ఫర్‌ బలోచిస్థాన్‌' అనే నినాదం ఉన్న బ్యానర్‌తో స్టేడియంపై ఓ విమానం వెళ్లగా.. నిన్న భారత్‌, శ్రీలంకల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా 'జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌' అనే  బ్యానర్‌తో ఓ విమానం స్టేడియం మీదుగా వెళ్లడం వివాదాస్పదంగా మారింది.