పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిపాదనలపై మండిపడిన బీసీసీఐ...

పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిపాదనలపై మండిపడిన బీసీసీఐ...

భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ ​కప్​ కోసం వీసాల మంజూరు విషయంపై పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీసాల మంజూరులో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రతిపాదించడంపై తీవ్రస్థాయిలో మండిపడింది. క్రీడాకారుల వీసాలకు సంబంధించి ఎటువంటి అంక్షలూ ఉండవని భారత ప్రభుత్వం ప్రకటించింది. అభిమానులు,  జర్నలిస్టులకు సైతం వీసాలు మంజూరు చేయాలని కోరటాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. పీసీబీ చేసిన ప్రతిపాదనలు అపరిపక్వతతో కూడినవిగా కొట్టిపారేసింది. టోర్నీ నుంచి నిష్క్రమించే ఉద్ధేశంతోనే పీసీబీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరోపించింది బీసీసీఐ.