టెస్ట్ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన భారత్...

టెస్ట్ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన భారత్...

ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీం ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-1 తో సొంతం చేసుకున్న భారత జట్టు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో పైకి దూసుకెళ్లింది. ఈ సిరీస్ ముందు వరకు టెస్ట్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు రెండో స్థానానికి వెళ్ళింది. ఇక అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈరోజు జరిగిన చివరి టెస్ట్ లో రిషప్ పంత్ అద్భుతంగా రాణించడంతో భారత్ విజయం సాధించింది. అయితే భర్త జట్టు యువ ఆటగాళ్లతో చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించడంతో జట్టుకు 5 కోట్ల బోనస్ ప్రకటించింది బీసీసీఐ.