ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం రేపేనా..?

ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం రేపేనా..?

ఐపీఎల్ నిర్వహణ పై బీసీసీఐ తుది నిర్ణయం రేపు తీసుకోనుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని  ప్రభావితం చేస్తుంది కరోనా. ఈ కరోనా ప్రభావం అని రంగాలతో పాటు గా క్రీడలపైనా కూడా చాలానే ఉంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాల సిరీస్ లు అలాగే మెగా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే ఇదే సమయం లో మన దేశం లో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ పై అందరికి అనుమానాలు ఉన్నాయి. ఈ ఐపీఎల్ పై రాష్ట్ర ప్రభుత్వాల నుండి వ్యతిరేకత వస్తుంది, ఇప్పటికే ఈ సంవత్సరం ఐపీఎల్ నిర్వహించకూడదని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అలాగే మిమ్ము ఐపీఎల్ కు అతిథ్యం ఇవ్వలేమని కర్ణాటక అంటే మహారాష్ట్ర మాత్రం అక్కడ ఐపీఎల్ టికెట్ల అమ్మకం పై నిషేధం విధించింది. ఈ విషయం పై ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ.

అయితే ఈ విషయం పై చర్చించడానికి రేపు నిర్వహించబోయే ఐపీఎల్ పాలక మండలి సమావేశానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లకు సంబంధించిన ఫ్రాంచైజీలన్నింటినీ 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా' (బిసిసిఐ) ఆహ్వానించింది. ఈ సమావేశం లో ఐపీఎల్ నిర్వహణ పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అసలు ఐపీఎల్ నిర్వహించాలా వద్ద... కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడం తో స్టేడియం లోకి అభిమానులను వెళ్లకుండా మ్యాచ్లు నడిపించాలా అనే విషయం పై ఓ స్పష్టతకు రానున్నారు. అయితే ఇప్పటివరకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం ఐపీఎల్ జరుగుతుంది అని చెప్పాడు.