ఆ గ్లౌజ్ వేసుకోవడానికి ధోనీకి అనుమతివ్వండి !

ఆ గ్లౌజ్ వేసుకోవడానికి ధోనీకి అనుమతివ్వండి !

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ బలిదాన్ గుర్తులున్న కీపింగ్ గ్లౌజ్ వేసుకున్న సంగతి తెలిసిందే.  దీనిపై పాక్ మంత్రి ఒకరు ఐసీసీకి పిర్యాధు చేశారు.  దీంతో ఐసీసీ, అలాంటి గ్లౌజ్ వేసుకోవడం నిబంధనలకు విరుధ్ధమని చెబుటూ బీసీసీఐని వివరణ కోరింది. 

ఈ వివాదంలో బీసీసీఐ ధోనీకి అండగా నిలిచింది.  ఆ గ్లౌజ్ వేసుకోవడానికి అనుమతులు కోరుతూ ఐసీసీకి లేఖ రాశారని బీసీసీఐ పాలకవర్గ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు.  ఇక ఐపీఎల్ చెర్మన్ రాజీవ్ శుక్లా సైతం ఆ గ్లౌజ్ వేసుకోవడానికి ఐసీసీ ధోనీకి అనుమతులు ఇవ్వాలని, అందులో ఎలాంటి వాణిజ్య అంశాలకు తావులేదని, కేవలం జాతి గౌరవం కోసమే అలా చేశాడని అన్నారు.  మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.