హైదరాబాద్‌లో ఐపీఎల్ ..! ముంబైలో జరగాల్సిన మ్యాచీలన్నీ ఇక్కడే..!
హైదరాబాద్‌లో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది.. ఐపీఎల్ షెడ్యూల్లో మొదట హైదరాబాద్‌లో ఏ ఒక్క మ్యాచ్‌కి చోటు దక్కలేదు.. కానీ, ఇప్పుడు ముంబైలో జరగాల్సిన అన్నీ మ్యాచ్‌లు హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. ఎందుకుంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొనగా.. ఆ వెంటనే ముంబైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను హైదరాబాద్‌కు మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడిపోయింది బీసీసీఐ. మరోవైపు.. ముంబైలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మరికొందరు అధికారులు.. ఒక వారం సమయం ఉండడంతో.. అక్కడే మ్యాచ్‌లు నిర్వహిస్తామని చెబుతున్నారు.. ఇక, ముంబైలోని కోవిడ్ 19 కేసులను నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ.. అదే సమయంలో, హైదరాబాద్ బ్యాక్-అప్ వేదిక పెట్టుకున్నట్టు సమాచారం.
మార్చి నెలలో కోవిడ్ -19 వేగంగా పుంజుకుంది.. ఇక, మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది.. రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా అంగీకరించారు.. ఇది మునుపటి కన్నా తీవ్రంగా ఉందన్నారు.. ఇదే సమయంలో.. ఎప్పుడైనా లాక్‌డౌన్‌కు వెళ్లొచ్చు అనే సంకేతాలు ఇచ్చారు. కానీ, లాక్‌డౌన్‌ను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. దీంతో.. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాదే బెటర్ అని అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించినప్పుడు.. హైదరాబాద్‌ను ఎంపికచేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది సర్కార్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలని గతంలో బీసీసీఐని కూడా కోరారు మంత్రి కేటీఆర్.. ఇప్పుడు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)