భారత ఆటగాళ్ళకు దుబాయ్ లో ట్రైనింగ్ క్యాంప్...?

భారత ఆటగాళ్ళకు దుబాయ్ లో ట్రైనింగ్ క్యాంప్...?

కరోనా  కారణంగా వచ్చిన విరామం తర్వాత దాదాపు అన్ని అగ్ర జట్లు తమ శిక్షణను ప్రారంభించాయి. కానీ మన భారత జట్టు ఆటగాళ్లు మాత్రం ఒంటరిగా ఏవరికి వారు శిక్షణ ప్రారంభించారు. అందులో... చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ  తదితరులు ఉన్నారు. అయితే బీసీసీఐ త్వరలో ఐపీఎల్ ను ప్రారంభించనుంది అని తెలుస్తుంది. అందుకోసమే... ఆటగాళ్లకు  దుబాయ్ లో  ట్రైనింగ్  క్యాంప్ ప్రారంభించాలని చూస్తుంది. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే ఐపీఎల్ ను కూడా అక్కడే  జరిపిస్తుంది అని సమాచారం. ఇక నాలుగు నెలల తర్వాత గత వారం ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ మొదలైంది. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేస్తే.. ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది.