బీసీసీఐ.. భాగ్యనగరాన్ని ఎందుకు పక్కనపెట్టింది...?

బీసీసీఐ.. భాగ్యనగరాన్ని ఎందుకు పక్కనపెట్టింది...?

హైదరాబాద్ కు ఏం తక్కువైంది ? కరోనా విజృంభిస్తున్న ముంబైలో సైతం వేదికను ఖరారు చేసిన బీసీసీఐ.. భాగ్యనగరాన్ని ఎందుకు పక్కనపెట్టింది ? ఇంతకీ ఐపీఎల్ టోర్నీలో ఫ్యాన్స్ కు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందా ?.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం ఎంపిక చేసిన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కకపోవడం ఇక్కడి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.  వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నా బీసీసీఐ భాగ్యనగరాన్ని విస్మరించడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఎలాంటి ఫ్రాంఛైజీ లేని అహ్మదాబాద్‌కు అవకాశం కల్పించారు. దేశంలోని అత్యుత్తమ క్రికెట్‌ స్టేడియాల్లో ఒక్కటైన ఉప్పల్‌కు మాత్రం మొండిచెయ్యే చూపించారు. స్థానిక ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఈ స్టేడియంతో మంచి అనుబంధం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌ వేదికల్లో హైదరాబాద్‌ లేదనే వార్తలు అభిమానులను నిరాశపరిచాయి.