పాండ్యా, రాహుల్‌కు నోటీసులు

పాండ్యా, రాహుల్‌కు నోటీసులు

ఓ టీవీ కార్యక్రమంలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో పాండ్యా, రాహుల్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసిన సీవోఏ.. ఆ తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తివేసినా.. అంబుడ్స్‌మన్‌ విచారణ మాత్రం పెండింగ్‌లో ఉంది. ఈక్రమంలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ గత వారం హర్దిక్‌, రాహుల్‌లకు నోటీసులు జారీ చేశానని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, రిటైర్డ్‌ జస్టిస్‌ డీకే జైన్‌ చెప్పారు. ఐపీఎల్‌లో బిజీబిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరూ ఈనెల 11కు ముందే అంబుడ్స్‌మన్‌ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.