హాస్పిటల్ లో చేరిన గంగూలీ...

హాస్పిటల్ లో చేరిన గంగూలీ...

భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈరోజు గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో గంగూలీని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత గంగూలీని డిశ్చార్జ్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం జిమ్ లో ఉన్న సమయంలో దాదాకు ఈ సమస్య వచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.