వివో తప్పుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమేమి లేదు : గంగూలీ

వివో తప్పుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమేమి లేదు : గంగూలీ

చైనా మొబైల్ ఫోన్ కంపెనీ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం నుండి తప్పుకోవడం గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఇది "ఆర్థిక సంక్షోభానికి" దారితీస్తుందనే చర్చను ఆయన తోసిపుచ్చారు. చైనా-ఇండియా మధ్య సరిహద్దు లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న వాదనల మధ్య యుఎఇలో సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే 2020 ఐపీఎల్ స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తాము తప్పుకుంటున్నట్లు వివో గత గురువారం తెలిపింది. వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను 2018 నుండి 2022 వరకు ఐదేళ్లపాటు 2,190 కోట్ల రూపాయలకు, అంటే సంవత్సరానికి సుమారు 440 కోట్ల రూపాయలకు గెలుచుకుంది. ఇక వివో తప్పుకోవడం పై గంగూలీ మాట్లాడుతూ... నేను దీనిని ఆర్థిక సంక్షోభం అని పిలవను. ఈ రకమైన పరిస్థితుల కోసం బీసీసీఐకి ఎప్పుడూ ప్లాన్ బి ఉంటుంది అని గంగూలీ అన్నారు. ఈ ప్లాన్ బి అనే ఆలోచనను వ్యక్తులు, బ్రాండ్లు, కార్పొరేట్ సంస్థలు అన్ని ఫాలో అవుతాయి. మేము కూడా అంతే అని భారత మాజీ కెప్టెన్ తెలిపాడు.