యువ క్రికెటర్‌పై బీసీసీఐ వేటు

యువ క్రికెటర్‌పై బీసీసీఐ వేటు

యూపీకి చెందిన యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌కి బీసీసీఐ షాకిచ్చింది. అతనిపై 3 నెలల నిషేధం విధించింది. ఏ స్థాయి క్రికెట్‌ కూడా ఆడకుండా ఆంక్షలు విధించింది. జూన్‌1వ తేదీ నుంచి సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అబుదాబిలో ఓ అనధికార క్రికెట్‌ టోర్నీలో రింకూ ఇటీవలే పాల్గొన్నాడు. ఇతర దేశాల క్రికెట్‌ లీగ్స్‌ ఆడాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి. కానీ బీసీసీఐ నుంచి అనుమతి పొందకుండానే రింకూ.. అబుదాబి టోర్నీలో పాల్గొన్నాడు. దీంతో.. బీసీసీఐ రింకూపై వేటు వేసింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగే రింకూ.. హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు.