కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన బీసీసీఐ...

కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన బీసీసీఐ...

కరోనా కేసులు పెరుగుతుండడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ టోర్నీపై కరోనా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆటగాళ్లు, సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా పూర్తిగా బయో బబుల్‌ వాతావరణంలోనే ఐపీఎల్‌ టోర్నీని నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ.. కేవలం ఆరు వేదికల్లోనే మ్యాచులను నిర్వహించాలని భావిస్తోంది. అంతే కాదు కొవిడ్‌ దృష్ట్యా ఈ సారి ప్రేక్షకులను అనుమతించబోమని చెబుతున్నారు బీసీసీఐ అధికారులు. బయో బబుల్‌లో ఐపీఎల్‌ టోర్నీ జరిగితే ఇకపై ఆటగాళ్లు ఎటు వెళ్లాలన్న బీసీసీఐ అనుమతి తప్పనిసరి. సీజన్‌ ముగిసే వరకు బోర్డు క్రియేట్‌ చేసిన బయో బబుల్‌లోనే ఉంటూ కొవిడ్‌ రూల్స్‌ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరోవైపు ఆటగాళ్లకు వ్యాక్సిన ఇచ్చే ప్రక్రియను వేగంవంతం చేస్తామని అధికారులు చెబుతున్నారు.