బీసీసీఐ పీఎం సహాయ నిధికి భారీ విరాళం...

బీసీసీఐ పీఎం సహాయ నిధికి భారీ విరాళం...

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ కారణంగా అని క్రీడా కార్యక్రమాలు ఆగిపోయాయి. అయితే ఈ వైరస్ ను ఎదురించడానికి సెలబ్రెటీలు, అలాగే భారత క్రికెటర్లు తమ వంతు సహాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదివరకే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, అలాగే లిటిల్ మాస్టర్ సచిన్ విరాళాలు సురేష్ రైనా విరాళం ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పీఎం సహాయ నిధికి 51 కోట్లు విరాళాన్ని ప్రకటించినట్టు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే బీసీసీఐ ఆధ్వర్యం లో జరిగే అని టోర్నీలు ఇంతకముందే వాయిదా పడిన విషయం తెలిసిందే.