అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను విజిట్ చేసిన ఎలుగుబంట్లు... 

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను విజిట్ చేసిన ఎలుగుబంట్లు... 

కొన్ని వీడియోలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి... ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.  లాక్ డౌన్ సమయంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి కనువిందు చేశాయి.  ఎప్పుడూ కనిపించని అరుదైన జంతువులు కనిపించడంతో ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.  అయితే, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని జంతువులు రోడ్డు మీదకు వస్తున్నాయి.  పోలీస్ స్టేషన్లను విజిట్ చేస్తున్నాయి.  ఇలాంటి సంఘటన ఒకటి ఛత్తీస్ గడ్ లో చోటు చేసుకుంది.  ఛత్తీస్ గడ్ లోని కాంకేర్ పోలీస్ స్టేషన్ ను మూడు ఎలుగుబండ్లు విజిట్ చేశాయి.  పోలీస్ స్టేషన్లోకి వచ్చిన ఎలుగుబంట్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు.  ఆ తరువాత అవి అక్కడి నుంచి మెల్లిగా వెళ్లిపోయాయి.  అర్ధరాత్రి సమయం కావడంతో ఎవరూ వాటిని డిస్ట్రబ్ చేయలేదు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.