వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం

వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం

వరంగల్ జిల్లాలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. కన్నాయిగూడ మండలం భూపత్‌పూర్‌లో ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పొలం పనులకు వెళ్లిన శ్రీను అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఈ క్రమంలో శ్రీను తన ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు ఎక్కినా.. ఎలుగుబంటి వదలలేదు. చివరికి శ్రీను పెంపుడు కుక్క ఎలుగుబంటితో పోరాటం చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎలుగుబంటి పోరాటంలో ప్రాణాలతో బయటపడిన శ్రీనును చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. శ్రీను ముక్కు, తొడ భాగం తీవ్రంగా గాయం అవడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు.