బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు..

బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు..

అసలే ఎండలు మండిపోతున్నాయి... చల్లగా ఓ బీర్ లాగించాలని మందు బాబులు.. బీర్ల కోసం ఎగబడుతున్నారు. ఇక వైన్స్‌లు, బార్లలో బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే, బీర్ల లోడ్‌తో వెళ్తోన్న ఓ లారీ దగ్ధమైపోయింది. నంద్యాల ఆర్టీవో ఆఫీస్ దగ్గర ఈ ఘటన జరిగింది. నాకౌట్ బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. వెనువెంటనే లారీ మొత్తం వ్యాపించాయి. మంటలార్పేందుకు యత్నించిన డ్రైవర్‌ గాయాలపాలయ్యాడు. స్థానికులు ఆ డ్రైవర్‌ను నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మరోవైపు లారీ మొత్తం మంటల్లో చిక్కుకోవడతో.. మంటల్లో బీరు సీసాలు పేలుతున్నాయి... దీంతో గాసు సీసాల ముక్కలు ఎగిరిపడుతున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి నుంచి బీర్లను నంద్యాలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.