ఇంగ్లండ్‌కు షాకిచ్చారు...

ఇంగ్లండ్‌కు షాకిచ్చారు...

ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది... మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు చివరి లీగ్ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో ఓడించిన బెల్జియం... గ్రూప్ జీలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్, బెల్జియం రెండు టీమ్స్ ప్రిక్వార్టర్‌కు క్వాలిఫై అయినప్పటికీ గ్రూప్‌లో టాప్ స్పాట్ కోసం జరిగిన ఫైట్‌లో బెల్జియం విజయం సాధించింది. ఇంగ్లండ్ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక సెనెగల్‌-కొలంబియా మధ్య జరిగిన పోరులో కొలంబియా 1-0తో విజయం సాధించి నాకౌట్‌కు చేరుకోగా, ఓటమితో సెనెగల్‌ టోర్నీ నుంచే నిష్ర్కమించింది. ఇక నాకౌట్‌లో జపాన్‌తో బెల్జియం, కొలంబియాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఒకవేళ ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం గెలిస్తే బ్రెజిల్ లేదా మెక్సికోతో క్వార్టర్స్‌లో తలపడాల్సి ఉంటుంది. అటు ఇంగ్లండ్ గెలిస్తే క్వార్టర్స్‌లో స్వీడన్ లేదా స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.