కవచంగా మెప్పిస్తాడా..?

కవచంగా మెప్పిస్తాడా..?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా కవచం.  వంశధార క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతున్నది.  కాజల్ అగర్వాల్ హీరోయిన్.  శ్రీనివాస్ మామిళ్ళ దర్శకుడు.  ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది.  ఇటీవలే రిలీజైన టీజర్ ఆకట్టుకున్నది.  ఇందులో బెల్లంకొండ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు.  కాజల్ కు రక్షకుడిగా కనిపించబోతున్నాడు.  

ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కు 5 వ సినిమా.  ఇంతకు ముందు వచ్చిన సాక్ష్యం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాతోనైనా బెల్లంకొండ దారిలోకి వస్తాడా చూడాలి.  డిసెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.