బెల్లంకొండ కొత్త లుక్ దేనికోసం!

బెల్లంకొండ కొత్త లుక్ దేనికోసం!

'అల్లుడు అదుర్స్' మూవీతో సంక్రాంతి బరిలో దిగిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను ఆ మూవీ ఫలితం నిరాశకు గురిచేసింది. అయినా పరాజయంతో రాజీ పడకుండా... తదుపరి లక్ష్యం దిశగా ఈ యంగ్ హీరో సాగుతున్నాడు. 'ఛత్రపతి'గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికంటే ముందే మరో తెలుగు సినిమాలనూ నటించే ఛాన్స్ శ్రీనివాస్ కు వచ్చింది. మరి  ఏ సినిమా కోసమో ఇప్పుడే చెప్పడం కష్టం కానీ ఈ కుర్ర కథానాయకుడు పెట్టిన లేటెస్ట్ పిక్ అదిరిపోయేలా ఉండటమే కాదు... అభిమానులను ఆనందపరుస్తోంది. మరి బెల్లంవారబ్బాయి కొత్త లుక్ ఏ సినిమా కోసమో తేలాల్సి ఉంది.