యూవీలో బెల్లంకొండ శ్రీనివాస్!

యూవీలో బెల్లంకొండ శ్రీనివాస్!

సూపర్ హిట్ మూవీ 'ఛత్రపతి' రీమేక్ ద్వారా బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచనల్లో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ నుండి ఓ మంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా, ప్రస్తుతం మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్న యూవీ క్రియేషన్స్... బెల్లంకొండ శ్రీనివాస్ తోనూ మూవీ నిర్మించే ఆలోచనలో ఉందట. కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ నచ్చడంతో అతనితోనే ఈ ప్రాజెక్ట్ ను చేయబోతోందట. ప్రస్తుతం ముంబాయి భామను హీరోయిన్ గా ఎంపిక చేసే పనిలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే... హిందీ 'ఛత్రపతి' కంటే ముందే ఈ తెలుగు సినిమా పట్టాలెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.