దిల్ రాజు లేకపోతే నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడ..

దిల్ రాజు లేకపోతే నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడ..

మాస్ మహరాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాను నైజాంలోని కొన్న థియేటర్లలో నిలిపిన సంగతి తెలిసిందే. సినిమా బాగా వసూళ్లు చేస్తున్నప్పటికీ ఎందుకు నిలిపారని కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేవారు. ఈ క్రమంతో నిర్మాత దిల్ రాజు థియేటర్ల విషయంలో నియంతలా వ్యవహరిస్తున్నాడని, క్రాక్ సినిమా బాగా ఆడుతున్న టైంలో సగం థియేటర్ల నుంచి కావాలనే తొలగించారిన విమర్శలు చేశారు. అదే సమయంలో మాస్టర్ సినిమా డిస్ట్రూబ్యూటర్ మహేష్ కోనేరు స్పందించారు. ‘మాస్టర్ సినిమాను మొదట 150థియేటర్లలో విడుదల చేశాం. కాని మరుసటి రోజే మరికొన్ని సినిమాలు రిలీజ్ కావడంతో మాస్టర్‌ను 80థియేటర్లకు తగ్గించాం. సినిమా ఆడుతున్న థియేటర్ల తగ్గించారని ఆగ్రహించడం కాదు. పండుగ కారణంగా మరికొన్ని సినిమాలు విడుదలవుతన్నాయి. వాటికి కూడా స్క్రీన్‌లు ఉండాల’ని మహేష్ కోనేరు అన్నాడు. అయితే ఈ విషయం మరింత ఉద్రిక్తగా మారింది. దిల్ రాజు పక్కా నియంతలా మారిపోయాడని, గౌరవం అనే పదాన్ని మర్చిపోయాడని వరంగల్ శ్రీను అన్నారు. అంతేకాకుండా ఇతరుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టకొని నడుచుకోవాలని, క్రాక్ సినిమాను నిలిపివేసి తనకు చాలా నష్టం తీసుకొచ్చాడని అన్నారు. తాజాగా ఇదే విషయంలో బెల్లంకొండ సురేష్ వరంగల్ శ్రీను పై సీరియస్ అయ్యారు. ‘దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత శ్రీనుకు లేదు. దిల్ రాజు లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ దుస్థితి ఏ విధంగా ఉండేదో ఊహకు రావడంలేదు. డిస్ట్రిబ్యూటర్ శ్రీను తన సినిమా హుషారుకు ఇంత వరకు జీఎస్‌టీ కట్టలేదు. నైజాం డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఇంకా నడుస్తుందంటే దానికి డిల్ రాజు, శిరీష్‌లే కారణం. వారు లేకపోతే సినీ పరిశ్రమలో మేము సినిమాలు చేయలేం బాబోయ్ అనే నిర్మాతలే ఉన్నారు. ఇంతటి మహమ్మారి వచ్చిన తరువాత కూడా అందరిని అలరించేందుకు మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేశార’ని అన్నారు. ఈ విషయం ఇంకెంతవరుకు వెలుతుందో తెలియడంలేదు. మరింత సమాచారం కోసం వేచి చూడాల్సిందే.